![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో.....అమూల్యని చూడడానికి వచ్చిన అబ్బాయి కామాక్షి వంక చూస్తాడు. తనే పెళ్లి కూతురు అనుకుంటాడు. అమూల్య జ్యూస్ ఇవ్వమని వేదవతి అంటుంది. తను వద్దు ఆ అమ్మాయి ఇవ్వాలని కామాక్షిని చూపిస్తాడు వరుడు. ఎందుకంటే కాబోయ్ భార్య చేత తీసుకోవాలని వరుడు అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి బాబు నువ్వు అనేది.. కాబోయే భార్య ఏంటి.. ఆల్రెడీ తనకి పెళ్లి అయిందని భాగ్యం అంటుంది.
దాంతో అబ్బాయి షాక్ అవుతాడు. తనని చూస్తే అసలు పెళ్లి కానట్లే ఉందని అబ్బాయి అనగానే.. నాకు పెళ్లి అయింది.. ఒక పాప కూడా ఉందని కామాక్షి అనగానే మా అబ్బాయి పొరపాటు పడ్డాడని అబ్బాయి పేరెంట్స్ అంటారు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందని వాళ్ళు అనగానే మీరు ముందు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అబ్బాయి వాళ్ళని ఇంట్లో నుండి పంపిస్తాడు రామరాజు. అ తర్వాత భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి బయటకు వచ్చి పెళ్లిచూపులు క్యాన్సల్ అయ్యాయని విశ్వకి చెప్తారు. అ తర్వాత అందరు డల్ గా ఉంటే తిరుపతి మాత్రం తన అతిలోకసుందరితో ఫోన్ మాట్లాడుతాడు. అందరు వచ్చి మామ.. నీ అతిలోకసుందరిని మాక్కూడా చూపించమని అనగానే ఫోన్ చేసి తిరుపతి తనని రప్పిస్తాడు. అతిలోకసుందరి వస్తుంది కానీ తన మొహం మాత్రం చూపించదు. అందరు తన మొహంపై ఉన్న కొంగు తియ్యాలని చూస్తారు కానీ తియలేరు. తిరుపతి మాత్రం తన మొహం చూసి షాక్ అవుతాడు.
మరొకవైపు రామరాజు దగ్గరికి వేదవతి వస్తుంది. అలా జరిగినందుకు రామరాజు బాధపడతాడు. అ తర్వాత అమూల్య, విశ్వ రహస్యంగా మాట్లాడుకుంటారు. పెళ్లిచూపులు క్యాన్సల్ అయినందుకు హ్యాపీ అవుతుంది అమూల్య. అ తర్వాత ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తుంది. తనకి కావలసిన వస్తువులన్నీ దాచేస్తుంది. వాటి కోసం ధీరజ్ వెతుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |